Mr Celebrity Movie Review: మిస్టర్ సెలబ్రిటీ రివ్యూ అండ్ రేటింగ్

0 Comments



Rating: 2.5/5

మూవీ: మిస్టర్ సెలబ్రిటీ రివ్యూ
నటీనటులు: వరలక్ష్మి శరత్ కుమార్, సుదర్శన్ పరుచూరి, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు, సప్తగిరి, 30 ఇయర్స్ పృథ్వీ తదితరులు
రచన, దర్శకత్వం: చందిన రవి కిషోర్
నిర్మాత : చిన్న రెడ్డయ్య, ఎన్.పాండురంగారావు
బ్యానర్ : ఆర్పీ సినిమాస్
సినిమాటోగ్రఫి: శివ కుమార్ దేవరకొండ
మ్యూజిక్: వినోద్ యాజమాన్య
పాటలు : గణేష్, రాంబాబు గోసాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వెంకట్ రెడ్డి
ఎడిటర్ : శివ శర్వాణి
రిలీజ్ డేట్: 2024-10-04

సామాజిక కార్యకర్త లలిత (శ్రీ దీక్ష)కు తనపై అత్యాచారం జరుపుతున్నట్టు కలలు వస్తుంటాయి. తరచు అలాంటి కలలు వెంటాడుతుండటంతో డాక్టర్ వద్దకు వెళ్తుంది. అయితే ఆమెకు గర్బ నిర్ధారణ పరీక్షలు జరిపించగా ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చినట్టు వైద్యుడు నిర్ధారిస్తారు. డాక్టర్ రిపోర్టుతో అయోమయంలో పడిపోయిన లలిత పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది.

Mr Celebrity Movie Review

లలితకు నిజంగా ప్రెగ్నెన్సీ వచ్చిందా? అయితే ఆమెపై అత్యాచారం చేసిందెవరు? ఈ కేసులో యూట్యూబర్ లక్కీ (సుదర్శన్ పరుచూరి)‌ను ఎస్సై నరహరి (రఘుబాబు) ఎందుకు అరెస్ట్ చేశాడు? నిజంగా లక్కి ఆమెపై అత్యాచారం చేశాడా? ఎవరైనా కావాలనే లక్కిని ఇరికించారా? ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్పైని చంపుతామని ఎవరు బెదిరించారు? లలిత కేసుతో సైంటిస్ట్ రామచంద్రయ్య (నాజర్), జానకి (ఆమని) సంబంధం ఏమిటి? ఈ కథను వరలక్ష్మీ శరత్ కుమార్ ఎలా మలుపు తిప్పింది అనే ప్రశ్నలకు సమాధానమే మిస్టర్ సెలబ్రిటీ సినిమా కథ.

మహిళపై లైంగిక దాడి బ్యాక్ డ్రాప్‌తో దర్శకుడు చందిన రవికిషోర్ రాసుకొన్న పాయింట్ బాగుంది. కథగా విస్తరించే క్రమంలో కొంత తడబాటు కనిపిస్తుంది. అయితే సోషల్ మీడియా యుగంలో ఓ రూమర్ ఎలాంటి విపరీత పరిస్థితులకు దారి తీస్తుందనే పాయింట్‌ చుట్టు అల్లు కొన్న సన్నివేశాలు, పాత్రల తీరుతెన్నుల ఆసక్తికరంగా ఉంటాయి. ఈ కథ, కథనాలపై మరింత దృష్టి పెట్టి ఉండే ఓ డిఫరెంట్ జోనర్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేదనిపిస్తుంది.

ఇక పరుచూరి బ్రదర్స్ కుటుంబం నుంచి నట వారసత్వం పుచ్చుకొన్న సుదర్శన్ తొలి సినిమాతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. తన పాత్ర పరిధి మేరకు రాణించారనే చెప్పాలి. తన చుట్టు తిరిగే కథలో భాగమైన శ్రీ దీక్ష పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. రఘుబాబు, సప్తగిరి, పృథ్వీ కామెడీ ఫర్వాలేదనిపిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ క్యారెక్టర్ ఎంట్రీతో కథ స్వరూపమే మారిపోతుంది.

ఇక ఈ సినిమాకు శివకుమార్ దేవరకొండ సినిమాటోగ్రఫి బలంగా కనిపించింది. వినోద్ యాజమాన్య బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. ఎడిటర్ శివ శర్వాణి తన కత్తెరకు మరింత పదును పెట్టాల్సిందనిపిస్తుంది. చిన్న రెడ్డయ్య, పాండురంగారావు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. క్రైమ్ కామెడీ తరహా సినిమాలను ఆదరించే వారికి ఈ మూవీ నచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts